: మూతపడనున్న 'ఫ్లిప్ కార్ట్' వెబ్ సైట్
భారత ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ సెప్టెంబర్ నుంచి తన వెబ్ సైటును మూసివేయనుంది. ఈ విషయాన్ని సంస్థ చీఫ్ ప్రాడక్ట్ ఆఫీసర్ పునిత్ సోని మంగళవారం తెలియజేశారు. ఫ్లిప్ కార్ట్ వెబ్ సైటును మూసేసి, కేవలం మొబైల్ యాప్ ద్వారా మాత్రమే అమ్మకాలు సాగించాలన్నది తమ ఉద్దేశమని ఆయన తెలిపారు. ఫ్లిప్ కార్ట్ కొనుగోళ్లలో 70 శాతం మొబైల్ మాధ్యమంగానే సాగుతున్నాయని ఆయన గుర్తు చేశారు. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. కాగా, ఫ్లిప్ కార్ట్ వెబ్ సైటును మూసివేస్తారని గతంలోనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నేడు అధికారిక ప్రకటన వెలువడింది.