: దేశవ్యాప్తంగా 906 ఐపీఎస్ పోస్టులు ఖాళీ... ఏపీ, తెలంగాణల్లో కూడా తీవ్ర సమస్య


శాంతిభద్రతల విషయంలో కీలక బాధ్యతలు పోషించే ఐపీఎస్ పోస్టులు భారీ ఎత్తున ఖాళీగా ఉండటం కలవరపరుస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 4,754 ఐపీఎస్ పోస్టులుండగా... కేవలం 3,848 మంది మాత్రమే ఉద్యోగాల్లో ఉన్నారు. మిగిలిన 906 ఐపీఎస్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. లక్నోకు చెందిన సామాజిక కార్యకర్త సంజయ్ శర్మ సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోం శాఖ జవాబిచ్చింది. హోం శాఖ ఇచ్చిన వివరాల ప్రకారం, ఉత్తరప్రదేశ్ లో 129 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ లో 98, ఒడిశాలో 79, మహారాష్ట్రలో 62, కర్ణాటకలో 59 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఐపీఎస్ ల కొరత తీవ్రంగానే ఉంది. ఏపీలో 26, తెలంగాణలో 21 ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

  • Loading...

More Telugu News