: గొడవ పడతాను కానీ, శత్రువులు లేకుండా చూసుకుంటా: నానాపటేకర్
'గొడవ పడతాను కానీ, శత్రువులు లేకుండా చూసుకుంటా'నని బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తెలిపాడు. ముంబైలో 'వెల్ కమ్ బ్యాక్' సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సినిమా దర్శకుడు అనీస్ తో కూడా గొడవ పడ్డానని చెప్పాడు. అయితే ఈ గొడవలు ఎంతో కాలం ఉండవని వెల్లడించాడు. అనీస్ సున్నిత స్వభావుడని చెప్పిన నానా పటేకర్, అతనితో ఓ సమస్య ఉందని అన్నాడు. చివరి క్షణంలో స్క్రిప్టు ఇస్తాడని, ఒక్కోసారి రేపు ఉదయం షూటింగ్ అంటే రాత్రి తీసుకుని వచ్చి ఇచ్చేవాడని, అలాంటప్పుడు గొడవ పడేవాడినని నానా పటేకర్ తెలిపాడు. కాగా, 2007లో వచ్చిన 'వెల్ కమ్' సినిమా సీక్వెల్ గా 'వెల్ కమ్ బ్యాక్' సినిమా రూపొందిందని, ఈ సినిమా సెప్టెంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని నానా చెప్పాడు.