: మరో దారిలేకనే కోహ్లీకి అప్పగించారు: అగార్కర్
భారత క్రికెట్ తీరుతెన్నులపై మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ మరోసారి సునిశిత వ్యాఖ్యలు చేశాడు. టెస్టులకు ధోనీ గుడ్ బై చెప్పాక మరో దారిలేకనే విరాట్ కోహ్లీకి టెస్టు జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించారని అన్నాడు. ధోనీ టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్నాక ఎవరో ఒకరికి బాధ్యతలు అప్పగించాలి కాబట్టి కోహ్లీకి పట్టం కట్టారని తెలిపాడు. ధోనీ టెస్టు కెప్టెన్ గా కొనసాగితే మేలని భావించినట్టు ఈ ముంబైవాలా పేర్కొన్నాడు. టెస్టుల్లో ధోనీ రికార్డు ఏమంత మెరుగ్గా లేకున్నా, మిగతా ఫార్మాట్లలో అతడి ప్రదర్శన, సాధించిన విజయాలు అద్భుతమని కొనియాడాడు. భారత క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ధోనీయేనని కితాబిచ్చాడు.