: 'చక్కగా పాడగల అమ్మాయి' కోసం అమీర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ ప్రకటన
'వుయ్ ఆర్ కాస్టింగ్' అంటూ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కు చెందిన ప్రొడక్షన్ హౌస్ చక్కగా పాడగల టీనేజీ అమ్మాయి కోసం వెతుకులాట మొదలుపెట్టింది. ఇందుకోసం రూపొందించిన ఓ ప్రకటనను అమీర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. 12 నుంచి 17 మధ్య వయసు ఉన్న బాగా పాడగల అమ్మాయి కావాలనుకుంటున్నట్టు ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు తమకు నచ్చిన హిందీ పాట పాడిన వీడియోను తమ మెయిల్ కు పంపాలని చెప్పారు. అంతేగాకుండా బాలికలు తమ తల్లిదండ్రులు లేదా గార్డియన్ చేత సంతకం చేయించిన పరిచయ పత్రాన్ని జతపరుస్తూ casting@akpfilms.comకు వివరాలను మెయిల్ చేయాలని వివరించారు.