: బాహుబలి పైరసీ నుంచి తప్పించుకున్నాడు!
బాహుబలి చిత్రాన్ని విడుదలైన రోజునే పైరసీ చేసేందుకు వేసిన ప్లాన్ ను బెంగళూరు పోలీసులు కనిపెట్టారు. ఈ ప్లాన్ వెనకున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని బాహుబలి దర్శకుడు రాజమౌళి నేడు మీడియాకు తెలిపారు. తమ చిత్రం తృటిలో పైరసీ భూతం నుంచి తప్పించుకుందని, ఇందుకు సహకరించిన బెంగళూరు పోలీసులకు కృతజ్ఞతలని ఆయన తెలిపారు. ఈ చిత్రం మొబైల్ ఫోన్లలో, కంప్యూటర్లలో చూసేది కాదని, పెద్ద తెరపై మాత్రమే చూడాలని ఆయన పిలుపునిచ్చారు. అభిమానులంతా సహకరించి పైరసీ నుంచి చిత్రాన్ని కాపాడాలని కోరారు.