: భోగాపురం ఎయిర్ పోర్టుకు రైతులు స్వచ్ఛందంగానే భూములిస్తున్నారు: మంత్రి గంటా
విజయనగరం జిల్లా భోగాపురంలో ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం స్థానిక రైతుల నుంచి భూములను బలవంతంగా లాక్కుంటున్నారన్న ఆరోపణలను మంత్రి గంటా శ్రీనివాసరావు ఖండించారు. రైతుల భూములను బలవంతంగా సేకరించే యోచనే లేదని విశాఖలో స్పష్టం చేశారు. స్వచ్ఛందంగానే భూములిచ్చేందుకు రైతులు ముందుకొస్తున్నారని ఆయన తెలిపారు. ఎయిర్ పోర్టు నిర్మాణానికి రెండు రోజుల్లో భూసేకరణ సర్వే మొదలవుతుందని గంటా చెప్పారు. 5,551 ఎకరాల్లోని 7 గ్రామాల్లో ఎయిర్ పోర్టు నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు.