: 3జిబి రామ్, 13 ఎంపి కెమెరాతో రూ. 8 వేలకు 4జీ స్మార్ట్ ఫోన్!


ఆసక్తికరమైన ఫీచర్లున్న మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రానుంది. తైవాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఆసుస్ 'పెగాసుస్ 2' పేరిట దీన్ని చైనాలో ఆవిష్కరించింది. ఈ ఫోన్లో 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ స్క్రీన్, 64 బిట్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, 3జిబి రామ్, 13 మెగాపిక్సల్ రియర్, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాలు, ఆండ్రాయిడ్ 5.11 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్, 3030 ఎంఎహెచ్ బ్యాటరీలు ఉంటాయని సంస్థ వివరించింది. ఈ స్మార్ట్ ఫోన్ 4జికి సపోర్ట్ చేస్తుందని, దీని ధర సుమారు రూ. 8 వేలకు అటూ ఇటుగా ఉంటుందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News