: 'చీకూభాయ్'ని వెళ్లనిచ్చేది లేదంటున్న చిన్నారులు


చీకూభాయ్... అదేనండీ మన విరాట్ కోహ్లీ ముద్దుపేరు. ఆయన్ను తమ ప్రాంతం నుంచి వెళ్లనిచ్చేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. అసలు విషయం ఏమిటంటే... విరాట్ కోహ్లీ ఢిల్లీలోని మీరాబాగ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. తమ ప్రాంతానికి విరాట్ నగర్ అని పేరు పెట్టుకోవడం ద్వారా ఆయన మీదున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడు కోహ్లీ తన నివాసాన్ని గుర్గావ్ లోని కొత్త ఇంటికి మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ సంగతి తెలిసిన స్థానికులు, ముఖ్యంగా చిన్నారుల ఆవేదన అంతా ఇంతా కాదు. భారత క్రికెట్ స్టార్ తమ కాలనీలో ఉండటం తమకు గర్వకారణమని, ఇప్పటి విరాట్ నిర్ణయం తమకు బాధ కలిగిస్తోందని అంటున్నారు. ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలన్న విషయంపై మరోసారి ఆలోచించాలని కోరుతున్నారు.

  • Loading...

More Telugu News