: మంత్రి దొరతనంపై స్పీకర్ కు ఎమ్మెల్యే చంద్రావతి ఫిర్యాదు
ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డిపై అదే జిల్లాకు చెందిన వైరా ఎమ్మెల్యే చంద్రావతి స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు ఫిర్యాదు చేశారు. మంత్రి దొరలా వ్యవహరిస్తూ.. ఇతర నియోజకవర్గాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ అంటే ఇదేనా? అని ఆమె తన ఫిర్యాదులో ప్రశ్నించారు.