: అసోంలో సభా వేదిక కూలడంతో కిందపడిపోయిన కేంద్ర మంత్రి


అసోంలోని డిబ్రూగఢ్ లో సోమవారం బీజేపీ కార్యకర్తల సమావేశం జరిగింది. యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర క్రీడల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ విచ్చేశారు. ఈ కార్యక్రమం కోసం ఓ వేదిక సిద్ధం చేశారు. అయితే, సామర్థ్యానికి మించి ఆ వేదికపైకి వ్యక్తులు చేరడంతో ఒక్కసారిగా కూలిపోయింది. 25 మంది కోసం నిర్మించిన ఆ వేదికపై 150 మంది చేరారు. దీంతో, అది కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో మంత్రి సోనోవాల్ కు గాయాలయ్యాయి. ఆయనను కలిసి కరచాలనం చేసేందుకు పార్టీ శ్రేణులు చూపిన అత్యుత్సాహమే ఘటనకు కారణమైందని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. మంత్రితో పాటు మరికొందరికి స్వల్ప గాయాలు కావడంతో సభా ప్రాంగణంలోనే వారికి ప్రథమ చికిత్స అందించారు.

  • Loading...

More Telugu News