: రోజూ మీడియా ముందుకు వచ్చి తిట్టాలా?: పవన్ కల్యాణ్
'సినీ నటుడు పవన్ కల్యాణ్ పార్టీ పెట్టాడు. కనబడడు, ఏమీ మాట్లాడడు' అని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలు పార్టీల నేతలు చేస్తున్న విమర్శలు తెలుసని పవన్ కల్యాణ్ అన్నారు. హైదరాబాదులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రోజూ మీడియా ముందుకు వచ్చి ఎవరినో ఒకరిని తిట్టుకుంటూ గడపాలా? అని ప్రశ్నించారు. విమర్శలు చేయడం గొప్పకాదని, వాటిల్లో విలువలు ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో వర్తమాన రాజకీయాల్లో నీతి నిజాయతీలు సాధ్యమా? అనిపిస్తుందని సందేహం వ్యక్తం చేశారు. వర్తమాన రాజకీయాల్లో ఒకర్నొకరు తిట్టుకునే విధానం చూస్తే 'పార్టీలన్నీ ఒకటే' అనిపిస్తుందని ఆయన తెలిపారు. పార్టీల నేతల ఆలోచనా విధానంలో మార్పులు రావాలని ఆయన సూచించారు.