: సెక్షన్-8కి నేను వ్యతిరేకం: పవన్ కల్యాణ్


ఇరు రాష్ట్రాల మధ్య సెక్షన్-8 ఇబ్బందికర పరిస్థితిని నెలకొల్పుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వ్యక్తిగతంగా సెక్షన్-8కి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. సెక్షన్-8ని అమలు చేసి తెలంగాణ వచ్చిన ఆనందాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దూరం చేయరాదని కోరారు. యూపీఏ, ఎన్డీఏలు రెండూ కలసి రాష్ట్రాన్ని విడగొట్టాయని... అందువల్ల, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ సభ్యులతో కూడిన ఒక పార్లమెంటరీ కమిటీని వేసి, హైదరాబాదులోని పరిస్థితులపై అధ్యయనం చేయించాలని సూచించారు. నగరంలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని... ఏదైనా సమస్య నెలకొంటే డైరెక్ట్ గా ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేసేలా ఆ ఆఫీసులో ఏర్పాట్లు చేయాలని చెప్పారు. హైదరాబాదులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News