: సరిహద్దు దాటి వచ్చిన బాలుడికి కొత్త బట్టలు, స్వీట్లు ఇచ్చి సాగనంపారు!


భారత్, పాకిస్థాన్ సరిహద్దుల వద్ద అప్పుడప్పుడు ఉల్లంఘనలు చోటుచేసుకోవడం సాధారణ విషయమే. అటువైపు వ్యక్తులు ఇటు, ఇటువైపు వ్యక్తులు అవతలివైపు వెళుతుంటారు. కొన్ని ఘటనల్లో ఉద్దేశపూర్వకంగానే వ్యక్తులు సరిహద్దులు దాటుతుంటారు. తాజాగా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) నుంచి సమీర్ కయాని అనే 11 ఏళ్ల బాలుడు భారత్ భూభాగంలో ప్రవేశించాడు. అతడు పీఓకేలోని లాస్వా వాసి. నియంత్రణ రేఖ దాటి వచ్చిన ఆ చిన్నారిని గుర్తించిన భారత సైన్యం వెంటనే ఆ విషయాన్ని హాట్ లైన్ ద్వారా పాక్ మిలిటరీ వర్గాలకు తెలిపింది. అనంతరం, తీత్వాల్ క్రాసింగ్ పాయింట్ వద్ద పాక్ సైనిక ప్రతినిధులతో ఫ్లాగ్ మీటింగ్ జరిపిన భారత సైనికాధికారులు ఆ బాలుడిని వారికి అప్పగించారు. ఈ సందర్భంగా భారత సైనికులు ఆ బాలుడికి కొత్త బట్టలు, స్వీట్లు ఇచ్చి మరీ సాగనంపడం విశేషం.

  • Loading...

More Telugu News