: డీఎస్ వెళ్లడంతో కాంగ్రెస్ లోని చెత్త పోయినట్టుంది: మధుయాష్కీ


ఇటీవలే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి, కారెక్కడానికి సిద్ధంగా ఉన్న సీనియర్ నేత డి.శ్రీనివాస్ పై మాజీ ఎంపీ మధుయాష్కీ విరుచుకుపడ్డారు. డీఎస్ వెళ్లడంతో కాంగ్రెస్ లోని చెత్తంతా వెళ్లిపోయినట్టుందని ఆయన ఎద్దేవా చేశారు. ఆయన వెళ్లడం వల్ల కాంగ్రెస్ కు ఎలాంటి నష్టం లేదని అన్నారు. డీఎస్ పచ్చి అవకాశవాది, వెన్నుపోటుదారుడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈరోజు రాష్ట్రపతిని కలిశారు. అనంతరం మధుయాష్కీ మీడియాతో మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం మేమంతా చేసిన కృషిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గుర్తించారని తెలిపారు.

  • Loading...

More Telugu News