: మోతె నా ఊరు...అభివృద్ధి చెందకుంటే పోయేది నా పరువే: తెలంగాణ సీఎం కేసీఆర్
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొద్దిసేపటి క్రితం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజామాబాదు జిల్లాలోని మోతె గ్రామ పర్యటనలో ఉన్న ఆయన హరితహారంలో భాగంగా అక్కడ మొక్కలు నాటారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ ‘‘మోతె నా ఊరు. అభివృద్ధి చెందకుంటే పోయేది నా పరువే’’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ప్రస్తావించిన సమస్యలపై స్పందిస్తూ అన్నింటినీ పరిష్కరిస్తానని అక్కడికక్కడే ప్రకటించారు. దాంతో గ్రామ ప్రజలు కేరింతలు కొట్టారు.