: టీడీపీలో చేరేందుకు సిద్ధమైన ప్రకాశం జడ్పీ చైర్మన్ బాలాజీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరబోతున్నట్టు ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ నూకసాని బాలాజీ ధ్రువీకరించారు. ఈ మేరకు ఈరోజు హైదరాబాద్ లో ఆయన సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ ను కలిశారు. టీడీపీలో చేరే విషయంపై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ, త్వరలో టీడీపీలో చేరతానని వెల్లడించారు. జిల్లా జడ్పీ చైర్మన్ అయినప్పటి నుంచి బాలాజీ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. జడ్పీ చైర్మన్ విషయం వివాదాస్పదమైన సమయంలో పార్టీ నేతలెవరూ స్పందించకపోవడం, తనకు అండగా నిలవకపోవడంతో బాలజీ ఆవేదన చెందారని, అందుకే టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.