: ‘వ్యాపం’లో మరో మిస్టరీ డెత్... చెరువులో శవమై తేలిన ట్రైనీ ఎస్సై
మొన్న ఓ జర్నలిస్ట్.. నిన్న విచారణ బృందంలోని మెడికల్ కళాశాల డీన్... తాజాగా ట్రైనీ ఎస్సై. వరుసగా మూడు రోజుల్లో మూడు మిస్టరీ డెత్ లతో మధ్యప్రదేశ్ ‘వ్యాపం’ కుంభకోణం కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా పెను సంచలనాలకు తెరలేపిన ‘వ్యాపం’ కుంభకోణంలో నేటి ఉదయం మరో మిస్టరీ డెత్ నమోదైంది. మధ్యప్రదేశ్ ను కుదిపేస్తున్న ఈ కుంభకోణంలో తాజా మృతితో అనుమానాస్పదంగా మృత్యువాతపడ్డ వారి సంఖ్య 48కి చేరుకుంది. మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలోని పోలీస్ శిక్షణా కేంద్రంలో ట్రైనింగ్ తీసుకుంటున్న ఎస్సై అనామికా కుష్వాహా చనిపోయారు. శిక్షణా కేంద్రానికి సమీపంలోని చెరువులో కుష్వాహా విగత జీవిగా కనిపించారు.