: నిధుల కొరతతో ‘హస్తం’ పార్టీ సతమతం...రూ.250కి పెరగనున్న సభ్యత్వ రుసుము


మొన్నటిదాకా కేంద్రంలో అధికారం చెలాయించిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ నిధుల కొరతతో సతమతమవుతోందట. వినడానికి విడ్డూరంగా ఉన్నా, ఇది ముమ్మాటికీ నిజమేనని సాక్షాత్తు ఆ పార్టీ కోశాధికారి, గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడు మోతీలాల్ వోరా నిన్న ప్రకటించారు. నిధుల కొరత నుంచి బయటపడేందుకు సభ్యత్వ నమోదు రుసుమును పెంచడమొక్కటే మార్గమని కూడా వోరా తేల్చేశారు. తదుపరి చేపట్టే సభ్యత్వ నమోదు కార్యక్రమం నుంచి ఈ రుసుమును రూ.250కి పెంచనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందులో రూ.100 పీసీసీలకు, రూ.150 ఏఐసీసీ ఖాతాకు బదిలీ అయ్యేలా చర్యలు చేపడతామని వోరా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News