: జపాన్ లో చంద్రబాబు వరుస భేటీలు..నవ్యాంధ్రలో పెట్టుబడులకు మిత్సుబిషి గ్రీన్ సిగ్నల్


నవ్యాంధ్రకు పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా జపాన్ లో పర్యటిస్తున్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు దూసుకెళుతున్నారు. నిన్న సాయంత్రానికి జపాన్ రాజధాని టోక్యోలో అడుగుపెట్టిన చంద్రబాబు, అక్కడి దిగ్గజ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీల్లో తలమునకలయ్యారు. ఈ క్రమంలో ఆయన ఫుజి ఎలక్ట్రానిక్స్, మిత్సుబిషి కార్పొరేషన్ తదితర సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. చంద్రబాబు ప్రజెంటేషన్ పై ఆసక్తి కనబరచిన మిత్సుబిషి నవ్యాంధ్ర వాణిజ్య రాజధానిగా రూపు సంతరించుకుంటున్న విశాఖలో సమాచార అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అంతేకాక తుని, కృష్ణపట్నంలలో తమ యూనిట్లను ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. తునిలో ఏర్పాటు చేయనున్న తమ ప్లాంట్ కు రవాణా సౌకర్యాన్ని కల్పించాలని చంద్రబాబును కోరారు. కేవలం వంద రోజుల్లోనే సదరు రోడ్డును నిర్మిస్తామని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. ఇక కృష్ణా జిల్లాలో గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టును కూడా చేపడతామని మిత్సుబిషి ప్రకటించింది.

  • Loading...

More Telugu News