: పుష్కరాలు పూర్తికాగానే సమ్మె: పెట్రోల్ డీలర్ల సంఘం


ఈ నెల 28 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లాలని ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ డీలర్లు, లారీ ఓనర్ల అసోసియేషన్ లతో కూడిన జేఏసీ నిర్ణయించింది. గత నెలలో చర్చలు జరిపిన ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పెట్రోలు డీలర్లు, లారీ ఓనర్ల అసోసియేషన్ జేఏసీ నేతలు గుంటూరులో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భవిష్యత్ ప్రణాళిక రచించారు. మంత్రి వర్గ ఉపసంఘం వేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని, తమ డిమాండ్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించిన జేఏసీ నేతలు, సమ్మెకు వెళ్లడమే పరిష్కారం అని పేర్కొంటున్నారు. అయితే పుష్కరాలు ఉండడంతో ప్రజారవాణాకు ఎలాంటి ఇబ్బందులు వాటిల్లకూడదనే ఉద్దేశ్యంతో పుష్కరాలు ముగిసిన తరువాత సమ్మెకు వెళ్లనున్నామని ప్రకటించారు.

  • Loading...

More Telugu News