: జిమ్మీబాబుపై చర్యలు తీసుకుంటాం: హెచ్ సీఏ
'ఓటుకు నోటు' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ యువనేత జిమ్మీబాబుపై చర్యలు తీసుకుంటామని హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. ఓటుకు నోటు కుంభకోణంలో జిమ్మీబాబు పేరు తెరపైకి రావడంతో హెచ్ సీఏ స్పందించింది. ఓటుకు నోటు కుంభకోణంతో హెచ్ సీఏకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. కరీంనగర్ జల్లా గోదావరి ఖని ప్రాంతానికి చెందిన జిమ్మీబాబు హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ కో ఆర్డినేటర్ గా ఉన్నారు. రేపు సాయంత్రంలోగా విచారణకు హాజరుకావాలని ఏసీబీ స్పష్టం చేయడంతో హెచ్ సీఏ వివరణ ఇచ్చింది.