: గుంటూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం...గ్యాస్ సిలిండర్ల పేలుళ్లతో పరుగులు తీసిన ప్రజలు


గుంటూరు జిల్లా నగరం మండల కేంద్రంలోని జంగాలకాలనీలో కొద్దిసేపటి క్రితం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసిన మంటల కారణంగా దాదాపు వంద ఇళ్లు తగలబడిపోతున్నాయి. అగ్ని ప్రమాదం నేపథ్యంలో పలు ఇళ్లలోని 40 గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన కాలనీ వాసులు తలో దిక్కుకు పరుగులు పెట్టారు. ప్రమాదంపై అగ్నిమాపక శాఖ వేగంగా స్పందించని కారణంగానే పెద్ద సంఖ్యలో ఇళ్లు తగలబడిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదంలో దాదాపు కోటి రూపాయలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక సమాచారం.

  • Loading...

More Telugu News