: మరింత విషమంగా భూమా ఆరోగ్యం... నిమ్స్ కు తరలించే విషయంపై సందిగ్ధత


వైసీపీ సీనియర్ నేత, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోగ్యం మరింతగా క్షీణించినట్లు సమాచారం. నిన్న సాయంత్రమే కర్నూలులోని సర్వజన వైద్యశాలకు తరలించిన పోలీసులు ఆయనకు అక్కడి వైద్యులతో చికిత్స అందిస్తున్నారు. భూమాకు అధిక రక్తపోటు, ఛాతీ నొప్పి, షుగర్ లెవెల్స్ పడిపోయిన నేపథ్యంలో నిన్నటి నుంచి పోలీసులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. హైదరాబాదులోని నిమ్స్ కు తరలించాలన్న భూమా విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించిన పోలీసులు కర్నూలులోనే చికిత్స అందజేసే ఏర్పాట్లు చేశారు. తాజాగా నేటి ఉదయం భూమా ఆరోగ్యం మరింత విషమించిన నేపథ్యంలో నిమ్స్ కు తరలించక తప్పని పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు భూమాను హైదరాబాదుకు తరలించే విషయంపై సందిగ్ధంలో కూరుకుపోయారు. ఈ విషయంలో వారు ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News