: ఫిల్మ్ నగర్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు... 18 మందిపై కేసులు నమోదు


హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ లో నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఫుల్లుగా మద్యం సేవించి వాహనాలతో రోడ్లపైకి వచ్చిన 18 మంది ఈ తనిఖీల్లో పోలీసులకు పట్టుబడ్డారు. వీరిపై కేసులు నమోదు చేసిన పోలీసులు రేపు కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక పట్టుబడ్డ నిందితుల నుంచి 15 బైకులు, మూడు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో పలువురు వ్యక్తులు ప్రముఖుల కుటుంబాలకు చెందినవారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News