: డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ క్రికెటర్


ఆసీస్ క్రికెటర్ జేమ్స్ ఫాల్కనర్ మాంచెస్టర్ లో 'డ్రంకెన్ డ్రైవ్'లో పట్టుబడ్డాడు. దీంతో అతనిని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. అతనికి బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం, ఈ నెల 21న హాజరు కావాలని ఆదేశించింది. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా ఆగ్రహం వ్యక్తం చేసింది. యువ క్రికెటర్లకు ఆదర్శంగా ఉండాల్సిన సీనియర్లు తప్పుదోవపట్టడం సరికాదని హెచ్చరించారు. తాగి వాహనాలు నడపడంలో ఉండే నష్టాలను గుర్తించాలని ఫాల్కనర్ కు సూచించినట్టు ఆసీస్ క్రికెట్ జట్టు పెర్ఫార్మెన్స్ ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ పాట్ హోవార్డ్ తెలిపారు. కాగా, షేన్ వార్న్, మైఖేల్ క్లార్క్ గతంలో తాగి వివాదాలు రేపినట్టు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News