: రాష్ట్రపతి అలా అంటే... ఓటుకు నోటు కేసు సమసిపోయిందని కాదు: వైకాపా
ఇరు తెలుగు రాష్ట్రాలు సోదర భావంతో మెలగాలని, ఇరు రాష్ట్రాలు సహకరించుకోవాలని రాష్ట్రపతి అన్నారంటే... ఓటుకు నోటు కేసు సమసిపోయిందని కాదని వైకాపా తెలంగాణ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. రాష్ట్ర సంబంధాలు వేరు, ఓటుకు నోటు కేసు వేరు అన్న రీతిలో రాష్ట్రపతి ప్రసంగం కొనసాగిందని చెప్పారు. చంద్రబాబు ఇప్పటికైనా రెండు రాష్ట్రాల మధ్య సెక్షన్-8ని ముడిపెట్టే అంశాన్ని మార్చుకోవాలని అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను గౌరవిస్తూ, ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.