: రేవంత్ రెడ్డిని పరామర్శించిన సినీనటుడు శివకృష్ణ


ఓటుకు నోటు కేసులో బెయిల్ పై విడుదలైన టీటీడీపీ నేత రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు శివకృష్ణ పరామర్శించారు. కొడంగల్ లోని రేవంత్ నివాసానికి వెళ్లిన శివకృష్ణ ఆయనతో కాసేపు గడిపారు. అనంతరం రేవంత్ తో పలువురు న్యాయవాదులు భేటీ అయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత జరిగిన ర్యాలీ, రేవంత్ చేసిన ప్రసంగంపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులకు సంబంధించి న్యాయవాదులతో రేవంత్ చర్చించారు.

  • Loading...

More Telugu News