: తెలంగాణలో జేఈఈ పరీక్ష రాసిన విద్యార్థులకు ఊరట


తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ర్యాంకులు గల్లంతైన జేఈఈ విద్యార్థులకు ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో విద్యార్థుల సమస్యకు పరిష్కారం లభించింది. ర్యాంకులు గల్లంతైన జేఈఈ విద్యార్థులకు సీబీఎస్ఈ అనుబంధ ర్యాంకులను ఈ రోజు ప్రకటించింది. రేపు సాయంత్రం వరకు ఐచ్ఛికాల ఎంపిక చేసుకునేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించారు. 1184 మంది విద్యార్థుల అనుబంధ ర్యాంకుల వివరాలను సీబీఎస్ఈ వెబ్ సైట్ లో ఉంచారు. దాని ద్వారా ర్యాంకులు తెలుసుకోవచ్చని రేపటివరకు ఆప్షన్ సౌకర్యం ఉంటుందని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు.

  • Loading...

More Telugu News