: తలపాగా విప్పిన ఆ సిక్కు యువకుడికి న్యూజిలాండ్ పురస్కారం
రక్తం కారుతున్న ఓ బాలుడికి కట్టుకట్టేందుకు తలపాగాను తీసిన సిక్కు యువకుడి వార్త మీరు వినే ఉంటారు. మత సంప్రదాయాలకు విరుద్ధమని తెలిసినా మానవత్వాన్ని చూపిన హర్మాన్ సింగ్ పై సిక్కు గురువులే ప్రశంసలు కురిపించారు. ఇప్పుడా యువకుడికి న్యూజిలాండ్ ప్రభుత్వం ఓ అవార్డిచ్చి సత్కరించింది. 'డిస్ట్రిక్ట్ కమాండర్స్ సర్టిఫికెట్'ను మనకావు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో హర్మాన్ అందుకున్నాడు. బాధితులపై మానవీయ కోణంలో స్పందించిన అతను ప్రశంసనీయుడని కౌంటీ పోలీసు శాఖ అధికారి పొగిడారు. కాగా, గడచిన మే 15న డీజన్ అనే బాలుడు స్కూలుకు వెళ్తుండగా, ఓ కారు ఢీకొట్టింది. అతని తల నుంచి రక్తం కారుతుండడంతో, హర్మాన్ తన తలపాగా తీసి కట్టుకట్టి ప్రాథమిక చికిత్స చేశాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొట్టాయి.