: శ్రీశైలం వైకాపా ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదు... అజ్ఞాతంలో ఎమ్మెల్యే


ఆంధ్రప్రదేశ్ లో వైకాపాకు మరో ఇబ్బందికర ఘటన ఎదురైంది. ఆ పార్టీకి చెందిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో, రాజశేఖర్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నిన్న కర్నూలు జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక జరిగిన సందర్భంలో, టీడీపీకి చెందిన ఎంపీటీసీ బాలహుస్సేని అదృశ్యమయ్యారు. వైకాపా నేతలే తమ ఎంపీటీసీని కిడ్నాప్ చేశారని టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, రాజశేఖర్ రెడ్డే తనను కిడ్నాప్ చేశారని బండిఆత్మకూరు పీఎస్ లో బాలహుస్సేని ఫిర్యాదు చేశారు. మాట్లాడాలి, ఇంటికి రావాలంటూ తనను వైకాపా ఎమ్మెల్యే పిలిచారని... అక్కడకు వెళ్లేసరికి ఆయన తన ఇంటి వద్ద లేరని... అదే సమయంలో తనను ఎమ్మెల్యే అనుచరులు కిడ్నాప్ చేసి, స్కార్పియో వాహనంలో తరలించారని ఆరోపించారు. మరోవైపు, అజ్ఞాతంలోకి వెళ్లిన వైకాపా ఎమ్మెల్యేను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News