: సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సబర్వాల్ కన్నుమూత
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యోగేశ్ కుమార్ సబర్వాల్ (73) ఢిల్లీలో కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ రోజు ఢిల్లీలోని నిగమ్ భోద్ లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. నవంబర్ 1, 2005 నుంచి జనవరి 13, 2007 వరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఆయన పనిచేశారు. పోలీస్ శాఖలో సంస్కరణలకు సంబంధించి సంచలన తీర్పు ఇచ్చారు. జేఎంఎం కేసులో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చే విషయంలో సీబీఐకి మొట్టికాయలు వేసిన ఆయన, కొత్త ఎఫ్ఐఆర్ వేయాలని సంచలన తీర్పు వెల్లడించారు. ఇలా సంచలన తీర్పులు, వివాదాలతో సబర్వాల్ సమాన స్థాయిలో పలువురు అభిమానులు, శత్రువులను సంపాదించుకున్నారు.