: కోటి యూనిట్లు దాటిన 'మన బండి' అమ్మకాలు
'ఇది మన బండి' అంటూ 'ఎక్స్ ఎల్ సూపర్' పేరిట మోపెడ్ ను టీవీఎస్ భారత మార్కెట్లో ప్రవేశపెట్టి 25 సంవత్సరాలైంది. ఈ 25 సంవత్సరాల్లో టీవీఎస్ ఎక్స్ ఎల్ సూపర్ మోపెడ్ల అమ్మకాలు కోటి యూనిట్లను దాటాయి. ఈ విషయాన్ని టీవీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కేఎన్ రాధాకృష్ణన్ తెలిపారు. తాము అరుదైన ఘనతను సొంతం చేసుకున్నామని అన్నారు. ఈ వేడుకలను సంస్థ ఘనంగా జరుపుతుందని, ఈ సందర్భంగా సరికొత్త ఎక్స్ ఎల్ వేరియంటును దక్షిణాది మార్కెట్లో విడుదల చేయనున్నామని తెలిపారు. సిల్వర్, గ్రే-టైటానియం రంగుల్లో ఈ మోడల్ వస్తుందని, ఈ రంగుల్లో మోపెడ్ కొద్ది కాలం మాత్రమే లభిస్తుందని వివరించారు.