: చైనాలో పెను భూకంపం... వేలాది ఇళ్లు ధ్వంసం


కొద్దిసేపటి క్రితం చైనాను పెను భూకంపం వణికించింది. తెల్లవారుఝామున వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది. ఆ వెంటనే 4-మ్యాగ్నిట్యూడ్ తో పలుమార్లు భూమి కంపించింది. దీని ప్రభావంతో పశ్చిమ చైనా, హోతాన్ రీజియన్ లోని పిషాన్ కౌంటీ గడగడలాడింది. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, పది మంది వరకూ మరణించారు. ఈ భూకంపం వల్ల సుమారు రూ. 6 వేల కోట్ల వరకూ ఆస్తినష్టం జరిగివుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. యూఎస్ జియోలాజికల్ సర్వే అందించిన వివరాల ప్రకారం 3 వేల వరకూ భవనాలు కుప్పకూలడమో, లేదంటే దెబ్బతినడమో జరిగింది. గ్రేడ్-4 ఎమర్జెన్సీ విధించిన చైనా సహాయ చర్యలను ప్రారంభించింది. భూకంప ప్రాంతంలోని నిర్వాసితుల కోసం చైనా ప్రభుత్వం 1000 టెంట్లు పంపింది. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News