: ధోనీ పోషించిన చిన్న పాత్ర... 'గులాబీ' విసిరాడు


భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోనీ 'గులాబీ' విసిరాడు. ఎవరిమీద అనుకుంటున్నారా? గులాబీ అంటే గులాబీ పువ్వు కాదులెండి. కొత్తగా క్రికెట్లో ప్రవేశపెట్టాలని భావిస్తూ, తయారు చేయించిన గులాబీ రంగులోని బంతిని. త్వరలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే తొలి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ లో ఈ బంతులను వాడాలన్న నిర్ణయంపై క్రికెట్ ప్రపంచంలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ధోనీ కూడా ఈ బంతిని వాడి పరిశీలించాడు. ప్రాక్టీసు చేస్తున్న బ్యాట్స్ మెన్ కు గులాబీ బంతితో బౌలింగ్ చేశాడు. దీన్ని వీడియో తీసిన ఆసీస్ క్రికెట్ బోర్డు డే అండ్ నైట్ టెస్టుల కోసం 'ధోనీ పోషించిన చిన్న పాత్ర' అంటూ దాన్ని ట్విట్టర్ లో పోస్టు చేసింది. ఇప్పుడీ వీడియో క్లిక్కుల మీదు క్లిక్కులతో దూసుకెళుతోంది.

  • Loading...

More Telugu News