: అది ఇక గత వైభవమేనేమో!: నాదల్
క్లే కోర్టుల రారాజు రఫేల్ నాదల్ తన ఫాంపై ఆందోళన వ్యక్తం చేశాడు. మునుపటి ఫాంను అందుకోగలనో, లేదోననే సందేహం వ్యక్తం చేశాడు. వింబుల్డన్ లో ఐదుసార్లు ఫైనల్ చేరి, రెండు సార్లు టైటిల్ విజేతగా నిలిచిన నాదల్ రెండో రౌండ్లోనే అనామక ఆటగాడి చేతిలో ఓటమిపాలయ్యాడు. దీంతో, తన ఫాంపై మాట్లాడుతూ, కోర్టులో వేగంగా కదల్లేకపోతున్నానని అన్నాడు. తన పూర్వపు ఫాం అందుకోగలననే నమ్మకం లేదని, అయినా ప్రయత్నిస్తానని నాదల్ మాటిచ్చాడు. అయితే తన ప్రతిభ గత వైభవంగా మారిపోతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశాడు. పూర్వవైభవం సాధించేందుకు మరింత కృషి చేస్తానని నాదల్ తెలిపాడు.