: టిబెట్ స్వయం ప్రతిపత్తికి పూర్తి హామీ
టిబెట్ స్వయం ప్రతిపత్తికి చైనా హామీ ఇచ్చింది. టిబెట్ ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలంటూ ఎంతో కాలంగా పోరాటం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిబెట్ అటానమస్ రీజియన్ (టీఏఆర్)కు గల ప్రాంతీయ ప్రతిపత్తికి పూర్తి హామీ ఉంటుందని టీఏఆర్ కమిటీ ప్రథమ డిప్యూటీ సెక్రటరీ వూ యీంగ్జీ తెలిపారు. టిబెట్ కు మరింత స్వయం ప్రతిపత్తి అవసరమని ధర్మశాలలో టీఏఆర్ కమిటీని ప్రవాస ప్రభుత్వం డిమాండ్ చేసింది. దీనిపై వూ యీంగ్జీ మాట్లాడుతూ, రాజకీయంగా చెప్పాలంటే టిబెట్ అటానమస్ రీజియన్ కు ఎప్పుడో స్వయం ప్రతిపత్తి ఇచ్చామని అన్నారు.