: ఆశ్రయం ఇవ్వాలని అభ్యర్థించిన అసాంజే... కుదరదన్న ఫ్రాన్స్
వికీలీక్స్ పేరిట ఆయా దేశాల అధికార రహస్యాలను బట్టబయలు చేసిన జూలియన్ అసాంజే తాజాగా ఫ్రాన్స్ ను ఆశ్రయం కోరారు. తనకు ఆశ్రయం కల్పించాలంటూ ఆయన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండేకు లేఖ రాశారు. అయితే, హోలాండే ఈ విన్నపాన్ని తోసిపుచ్చారు. అసాంజే వ్యవహారంతో న్యాయ, చట్టపరమైన అంశాలు ముడిపడి ఉన్నందున ఆశ్రయం ఇవ్వలేమని స్పష్టం చేశారు. గత మూడేళ్లుగా అసాంజే లండన్ లోని ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలో ఉంటున్నారు. లైంగిక దాడుల ఆరోపణల నేపథ్యంలో స్వీడన్ తనను అదుపులోకి తీసుకుంటుందన్న భయంతో అసాంజే ఈక్వెడార్ ఎంబసీని వీడి బయటకు రావడంలేదు.