: జగన్ నాకు కొడుకులాంటివాడు: ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తనకు కొడుకులాంటి వాడని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తయ్యేవరకు కాస్త ఓపిక పట్టాలని జగన్ కు జేసీ విజ్ఞప్తి చేశారు. గతంలో తాను కూడా ఎన్టీఆర్ హయాంలో హంద్రినీవా ప్రాజెక్టును విమర్శించానని అనంతపురంలో మీడియాతో అన్నారు. అసాధ్యమనుకున్న హంద్రినీవా ఇప్పుడు పూర్తవుతోందని చెప్పారు. జిల్లాలో తిండిలేక చనిపోతున్న వారెవరూ లేరని, జిల్లాకు నికర జలాలు కావాలని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News