: కేజ్రీని ఉత్తర కొరియా నియంతతో పోల్చిన కాంగ్రెస్


ఢిల్లీలో ఆమ్ ఆద్మీ సర్కారు ప్రచార కార్యక్రమాల కోసం రూ.526 కోట్ల భారీ బడ్జెట్ ను కేటాయించడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ నేత అజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉత్తర కొరియా నియంతను తలపిస్తున్నారని విమర్శించారు. సొంత డబ్బా కొట్టుకునేందుకు ఇంత భారీ కేటాయింపులా? అని ప్రశ్నించారు. "ఈ డబ్బును రోగులకు మెరుగైన చికిత్స కోసమో, ఆసుపత్రుల ఏర్పాటుకో, పాఠశాలలు, రోడ్ల నిర్మాణం కోసమో వెచ్చిస్తే బాగుంటుంది. సాధారణంగా ఢిల్లీ సర్కారు ప్రచారానికి రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్ల వ్యయం అయ్యేది. అది కూడా ఎక్కువే. అయినా, 'ఆప్' సర్కారు ప్రకటనలకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పును గమనించాలి. ఉత్తర కొరియా నియంత తనను తాను గొప్పగా ప్రచారం చేసుకుంటాడు. కేజ్రీవాల్ ఆ నియంతలా తయారవుతున్నారు" అని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News