: సానుభూతి హేమమాలినిపై ఎందుకు?... పసిపాపపై చూపాలిగానీ!


బీజేపీ పార్లమెంటు సభ్యురాలు, డ్రీమ్ గర్ల్ హేమమాలిని కారు యాక్సిడెంటుకు గురైన తరువాత ఆమె పట్ల నేతలు సానుభూతి ప్రకటించడంపై సామాజిక మాధ్యమాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వేగంగా దూసుకొచ్చిన ఆమె కారు కారణంగా అభంశుభం ఎరుగని చిన్నారి మృతిచెంది, మరో బాలుడి రెండు కాళ్లూ పోగా, వారిపై జాలి చూపని నేతలు హేమమాలిని వెంటపడుతున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. గాయపడ్డ వారిని వదిలేసి తన మానాన తాను ఆసుపత్రికి హేమ వెళ్లారని, బాధ్యతలు విస్మరించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇది కూడా 'హిట్ అండ్ రన్' కేసులో సల్మాన్ ఖాన్ ప్రవర్తనలానే వుందని దుయ్యబట్టారు. ఆమెను అత్యాధునిక ఫోర్టీస్ అసుపత్రికి తరలించి, ఆమె కారణంగా గాయాలపాలైన బాధితులను ప్రభుత్వాసుపత్రికి పంపడం వివక్షేనని అన్నారు. సామాన్యులకు దిక్కులేకుండా పోయిందని విమర్శలు గుప్పించారు. ఓవర్ టేక్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లయితే, హేమమాలిని కారుకు ముందువైపు కుడిపక్కన, ఆల్టోకు వెనుకవైపు ఎడమపక్కన ఎలా దెబ్బ తగులుతుందని ప్రశ్నిస్తున్నారు. వీటికి ఎవరు సమాధానం చెబుతారో మరి!

  • Loading...

More Telugu News