: కొవ్వూరు రైల్వే స్టేషన్ లో సౌకర్యాలపై ఎంపీ మురళీమోహన్ ఆగ్రహం
గోదావరి పుష్కరాల నేపథ్యంలో భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్ లో సౌకర్యాలపై ఎంపీ మురళీమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ లో సౌకర్యాల పరిస్థితిని పరిశీలించిన ఎంపీ అధికారులపై మండిపడ్డారు. పుష్కరాలకు వచ్చే యాత్రికులకు సౌకర్యాలు లేకపోవడం అన్యాయమన్నారు. సిబ్బంది నిర్లక్ష్యంపై ఆయన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.