: 'మహా' గవర్నర్ విద్యాసాగర్ రావు రాసిన 'ఉనికి' పుస్తకావిష్కరణ
మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు రచించిన 'ఉనికి' పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో అట్టహాసంగా జరిగింది. ఈ పుస్తకాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించారు. మొదటి కాపీని రాష్ట్రపతికి సీఎం కేసీఆర్ అందించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ, రాష్ట్రపతి పుస్తకాన్ని ఆవిష్కరించడం సంతోషం కలిగించిందన్నారు. ఆయన ఆవిష్కరించడం ద్వారా ఉనికికే ఉనికి ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ప్రతిపక్ష నేత జానారెడ్డి, ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.