: కేసీఆర్ కు రూ.5 కోట్ల వాహనం అవసరమా?...ఎవరి నుంచి ముప్పుందో చెప్పండి?: వీహెచ్ వ్యాఖ్య


టీ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఫైరయ్యారు. నేటి ఉదయం పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ భద్రత కోసం రూ.5 కోట్లు ఖర్చుపెట్టి కొనుగోలు చేసిన బస్సుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఏం వెలగబెట్టారని కేసీఆర్ కు ముప్పు పొంచి ఉంది? ఎవరి నుంచి ముప్పు పొంచి ఉంది? అసలెందుకీ అత్యాధునిక బస్సు? అంత ఖర్చు పెట్టి ఈ బస్సు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమిటీ?’’ అంటూ వీహెచ్ వరుస దాడికి దిగారు.

  • Loading...

More Telugu News