: యూరీ సెక్టార్ లో ఎన్ కౌంటర్... నలుగురు ఉగ్రవాదుల హతం
భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై ఇండియన్ ఆర్మీ విరుచుకుపడింది. జమ్మూ కాశ్మీర్ లోని యూరీ సెక్టార్ లో నేటి ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో నలుగురు తీవ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. గుట్టుచప్పుడు కాకుండా పాక్ భూభాగం నుంచి భారత భూభాగంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు యత్నించారు. అయితే అప్రమత్తంగా ఉన్న భారత సైనికులు ఉగ్రవాదుల కదలికలను పసిగట్టి ఒక్కసారిగా దాడికి దిగారు. ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.