: సోనియాతో ఎంపీ వీహెచ్ భేటీ... తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో ఆ పార్టీ తెలంగాణ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి. హన్మంతరావు(వీహెచ్) కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులను ఆయన అధినేత్రికి వివరించారు. పార్టీ అగ్రనేత ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) పార్టీని వీడిన తర్వాత జరుగుతున్న ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. డీఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరుతున్న విషయం తెలిసిందే. దీనిపై మూడు రోజుల క్రితమే సోనియాకు డీఎస్ రాజీనామా లేఖ రాశారు. అందులో ప్రస్తావించిన పలు అంశాలను సోనియా గాంధీ, వీహెచ్ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. అంతేకాక మరిన్ని జంపింగ్ లు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలోనూ వీహెచ్ నుంచి ఆమె వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది.