: మత్తయ్య కాల్ డేటా బయటకొస్తే దేశ భద్రతకే ముప్పు... కోర్టులో టెల్కోలు


జెరూసలేం మత్తయ్య, ఆయన కుటుంబ సభ్యులు గత నెల రోజుల్లో ఎవరెవరితో ఫోన్లలో మాట్లాడారన్న విషయాలు బయటకు వెల్లడిస్తే దేశ భద్రతకు ముప్పని టెలికం సంస్థలు కోర్టుకు స్పష్టం చేయడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఈ మేరకు టెల్కోలు విజయవాడ కోర్టుకు లిఖిత పూర్వకంగా రాసివ్వడంతో కాల్ డేటా సంపాదించే క్రమంలో ఏం చెయ్యాలన్న విషయమై ఏపీ పోలీసులు తలపట్టుకుంటున్నారు. సిట్ విచారణలో భాగంగా తమ వద్ద ఉన్న సమాచారం గురించి చెప్పిన సర్వీస్ ప్రొవైడర్లు ఆధారాలు అందించేందుకు మాత్రం నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో సిట్ అధికారులు విజయవాడ కోర్టును ఆశ్రయించగా, తొలుత హైదరాబాద్ సీసీఎస్ పోలీసులపై ఫిర్యాదు చేసిన టెల్కో సంస్థలు, ఆపై మాట మార్చి కేంద్ర హోం శాఖ అనుమతి తీసుకోవాల్సి వున్నందున నెల సమయం కావాలని అడిగారు. తిరిగి ఇప్పుడు దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన విషయాలున్నందున సమాచారం ఇవ్వలేమని రాతపూర్వక సమాధానంలో తెలిపి చేతులెత్తేశారు. మత్తయ్య అంతర్గత భద్రతకు ముప్పు కలిగించే స్థాయి వ్యక్తా? అని ఏపీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితిపై సిట్‌, సీఐడీ అధికారులతో డీజీపీ జేవీ రాముడు సమీక్ష నిర్వహించారు.

  • Loading...

More Telugu News