: చంద్రబాబు ఆహ్వానిస్తే ...టీడీపీలోకి వస్తా: దాడి వీరభద్రరావు ప్రకటన
టీడీపీని వీడి వైసీపీలో చేరిన ఏపీ సీనియర్ రాజకీయవేత్త దాడి వీరభద్రరావు మళ్లీ టీడీపీ వైపు చూస్తున్నారు. వైసీపీలో చేరిన ఆయన అక్కడ ఎక్కువ కాలం ఇమడలేకపోయారు. వైసీపీలో ఉన్న సమయంలోనే ఆ పార్టీ అధినేత వైెఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు గుప్పించి, దాడి సంచలనం రేపారు. ఆ తర్వాత వైసీపీకి కూడా దూరమైన దాడి కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాజాగా ఆయన కొద్దిసేపటి క్రితం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆహ్వానిస్తే తిరిగి టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగానే ఉన్నట్లు ఆయన ప్రకటించారు. మరి దాడి ప్రకటనపై టీడీపీ అధినేత ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.