: ‘ఓటుకు నోటు’లో ఏసీబీ కోర్టుకు చేరిన ‘ఫోరెన్సిక్’ తుది నివేదిక


తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టిన ఓటుకు నోటు వ్యవహారంలో కీలక ఆధారాలుగా పరిగణిస్తున్న ఆడియో, వీడియో టేపులు, ఫోన్ సంభాషణల విశ్లేషణ పూర్తైంది. ఈ మేరకు టేపులు, ఫోన్ సంభాషణలను పూర్తి స్థాయిలో విశ్లేషించిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ (ఎఫ్ఎస్ఎల్) తన తుది నివేదికను నిన్న ఏసీబీ కోర్టుకు సమర్పించింది. విషయం తెలుసుకున్న ఏసీబీ అధికారులు నివేదిక కాపీ తమకు కావాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిని ఇచ్చే విషయంపై కోర్టు నేడు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఈ నివేదిక కాపీ తమ చేతికి చిక్కితే, దర్యాప్తును మరింత వేగంగా పూర్తి చేయచ్చని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News