: ఈ ఏడాది అర్ధ భాగంలో 71 మంది జర్నలిస్టుల హత్య: పీఈసీ నివేదిక
ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 24 దేశాల్లో 71 మంది పాత్రికేయులు హత్యకు గురయ్యారని ప్రెస్ ఎంబ్లెమ్ క్యాంపైన్ (పీఈసీ) నివేదిక వెల్లడించింది. గతేడాది ఇదే కాలంతో పోల్చితే మరణాల్లో ఈసారి ఏడు శాతం పెరుగుదల ఉందని పేర్కొంది. ఫ్రాన్స్, లిబియా, ఇరాక్ లో ఉగ్రవాదుల లక్ష్యంగా జరిగిన ఘటనల్లో 24 మంది జర్నలిస్టులు చనిపోయారని, 17 మంది యెమన్, లిబియా, ఇరాక్, సిరియా, సౌత్ సుడాన్, ఉక్రెయిన్ లలో పోరాటాలను కవర్ చేస్తూ మరణించినట్టు నివేదిక తెలిపింది. ఇక మిగతా 30 మంది జర్నలిస్టులు లాటిన్ అమెరికా, ఫిలిప్పైన్స్, ఇండియాలో జరిగిన నేర ఘటనల్లో హత్యకు గురయ్యారని నివేదిక వివరించింది. మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా ప్రాంతాలు మీడియా కవరేజ్ కు చాలా దారుణమైనవని, ఇప్పటికే అక్కడ 23 మంది జర్నలిస్టులు చనిపోయారని జిన్హువా పత్రిక పేర్కొంది. అతి తక్కువమంది పాత్రికేయులు సిరియాలో మీడియా కవరేజ్ చేసేందుకు రిస్క్ తీసుకుంటారని వివరించింది.